అంధ బాలికపై ఇద్దరు టీచర్ల అత్యాచారం.. నిందితులూ అంధులే

అంధురాలైన 15ఏళ్ల బాలికపై ఇద్దరు ఉపాధ్యాయులు నాలుగు నెలల పాటు అత్యాచారానికి పాల్పడిన ఘటన గుజరాత్లో జరిగింది. నిందితులు కూడా అంధులే కావడం ఈ ఘటనలో మరింత దిగ్భ్రాంతి కలిగించే విషయం. Also Read: పటాన్ జిల్లాకు చెందిన ఓ అంధ బాలిక అంబాజీ పట్టణంలోని ఓ ట్రస్ట్ నిర్వహించే హాస్టల్లో ఉంటూ చదువుకుంటోంది. నాలుగు నెలలుగా ఇద్దరు టీచర్లు ఆమెను బెదిరించి అత్యాచారం చేస్తున్నారు. ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే చంపేస్తామని చెప్పడంతో బాలిక మౌనంగా ఉండిపోయింది. దీపావళి పండుగ కోసం ఇంటికి వెళ్లిన బాలిక తిరిగి హాస్టల్కు వెళ్లేందుకు నిరాకరించింది. దీంతో అనుమానం వచ్చిన తల్లిదండ్రులు ఏం జరిగిందని నిలదీయగా తనపై జరుగుతున్న అఘాయిత్యాన్ని వివరించి బోరుమంది. Also Read: దీంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ విషయం తెలుసుకున్న ఆ కామంధులు పరారయ్యారు. నిందితుల్లో ఒకరు 62ఏళ్ల వృద్ధుడని పోలీసులు తెలిపారు. బాలికను వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రి తరలించారు. Also Read:
By November 09, 2019 at 08:50AM
No comments