Breaking News

సూపర్‌ స్టార్‌ ఫ్యాన్స్‌ బీ రెడీ.. యుద్ధానికి సిద్ధమవుతున్న అవుతున్న మహేష్‌


సూపర్‌ స్టార్ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్ర సరిలేరు నీకెవ్వరు. కామెడీ స్పెషలిస్ట్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే షూటింగ్‌ చివరి దశకు చేరుకున్న ఈ సినిమా నిర్మాణానంతర కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. Also Read: త్వరలో ప్రమోషన్‌ కార్యక్రమాలు కూడా ప్రారంభించేందుకు రెడీ అవుతున్నారు ఫ్యాన్స్‌. తాజాగా ఈ విషయానికి సంబంధించి ఓ అప్‌డేట్‌ ఇచ్చాడు దర్శకుడు . మహేష్‌ గన్‌తో నడిచివస్తున్న చిన్న వీడియో క్లిప్‌ను తన ట్విటర్‌ పేజ్‌లో పోస్ట్‌ చేసిన డైరెక్టర్ టీజర్‌ లోడింగ్‌ అంటూ ట్వీట్ చేశాడు. అంటే త్వరలోనే సరిలేరు నీకెవ్వరు టీజర్‌ రిలీజ్‌ కానుంది. సరిలేరు నీకెవ్వరు సినిమాతో పాటు రిలీజ్‌కు రెడీ అవుతున్న మరో సినిమా అల వైకుంఠపురములో. అల్లు అర్జున్‌ హీరోగా త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రమోషన్‌ కార్యక్రమాల్లో దూసుకుపోతోంది. ఇప్పటికే టీజర్‌తో పాటు రెండు పాటలను రిలీజ్ చేశారు చిత్రయూనిట్‌. ఈ పాటలు సూపర్‌ హిట్ కావటంతో సినిమా మీద అంచనాలు భారీగా పెరిగిపోయాయి. Also Read: ప్రమోషన్‌ విషయంలో మహేష్‌ కాస్త వెనకపడ్డాడడనే చెప్పాలి. భారీగా తెరకెక్కుతున్న సరిలేరు నీకెవ్వరు సినిమా ప్రమోషన్‌ విషయంలో ఇంకా వేగం పెంచలేదు చిత్రయూనిట్‌. బన్నీ యూట్యూబ్‌లో మిలియన్ల కొద్ది వ్యూస్‌తో దూసుకుపోతుంటే.. మహేష్ ఇంకా టీజర్‌ లోడింగ్‌ అంటూ షార్ట్‌ వీడియోస్‌తో సరిపెడుతున్నాడు. దీంతో సూపర్‌ స్టార్‌ అభిమానులు సినిమా అప్‌డేట్స్‌ కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. మహేష్ బాబు సరసన రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాతో సీనియర్ హీరోయిన్‌ విజయశాంతి సిల్వర్ స్క్రీన్‌ రీ ఎంట్రీ ఇస్తున్నారు. కొంత కాలంగా సీరియస్‌ సినిమాలుచేస్తున్న సూపర్‌ స్టార్‌ ఈ సినిమాలో పూర్తి కామెడీ రోల్‌లో కనిపించనున్నాడు. ఈ సినిమా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. Also Read:


By November 16, 2019 at 10:09AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/mahesh-babus-sarileru-neekevvaru-teaser-release-update/articleshow/72080985.cms

No comments