Breaking News

తప్పుడు ప్రచారం చేయకండి.. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆవేదన


కొద్ది రోజులుగా ఆసుపత్రి చికిత్స తీసుకుంటున్న లెజెండరీ సింగర్‌, భారత రత్న ఆరోగ్య పరిస్థితిపై సోషల్ మీడియాలో రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. ఆమె ఆరోగ్యం విషమించిందన్న వార్తలతో పాటు కొంత మంది ఆకతాయిలు ఆమె మృతి చెందినట్టుగా ప్రచారం చేస్తున్నారు ఈ వార్తలపై మరో లెజెండరీ సింగర్‌ స్పందించారు. నిన్న రాత్రి తన ఫేస్‌బుక్‌ పేజ్‌లో సోషల్ మీడియాలో వస్తున్న వార్తలపై ఓ వీడియో మెసేజ్‌ను పోస్ట్ చేశారు. `సోషల్‌ మీడియాలో వస్తున్న పుకార్లు ఎంత దారుణంగా ఉన్నాయంటే.. గత రెండు రోజులుగా గాయని లతా మంగేష్కర్‌గారి ఆరోగ్య పరిస్థితి గురించి వస్తున్న పూర్తిగా తప్పు. కొంత మంది వ్యక్తుల సరైన సమాచారం లేకుండా తప్పుడు వార్తలను పోస్ట్ చేస్తున్నారు. Also Read: నేను వ్యక్తిగతంగా తెలుసుకున్నాను. లతాజీ ఆరోగ్యం నిన్నటి కన్నా ఈ రోజు ఎంతో మెరుగ్గా ఉంది. ఆమె త్వరగా కోలుకుంటున్నారు. ఆమె బాగుండాలని కోట్లాది మంది అభిమానులు ప్రార్థనలు చేస్తున్నారు. అందరికీ నా రిక్వెస్ట్‌.. సరైన సమాచారం లేకుండా కేవలం ఎవరో షేర్‌ చేశారని తప్పుడు వార్తలను మీరు కూడా షేర్‌ చేయకండి.` అంటూ వీడియో మెసేజ్‌ను పోస్ట్ చేశారు. Also Read: ప్రముఖ గాయని లతా మంగేష్కర్‌ ప్రస్తుతం ముంబైలోని బ్రీచ్‌ కాండీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. సోమవారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో ఆమెను ఆసుపత్రిలో జాయిన్‌ చేశారు. ఆమె శ్వాసతీసుకోవటంలో ఇబ్బందులు ఎదురవ్వటంతో ఐసీయూలో ఉంచి చికిత్స చేస్తున్నారు. అయితే ఆసుపత్రిలో జాయిన్‌ అయ్యే సమయానికి ఆమె ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగానే ఉన్నట్టుగా తెలిసింది. Also Read: దీంతో సోషల్ మీడియాలో రకరకాల వార్తలు వినిపించాయి. ఈ వార్తలపై ఆమె కుటుంబ సభ్యులు సినీ ప్రముఖుల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. లతా మంగేష్కర్‌ కోలుకుంటున్నారని, త్వరలోనే ఆమె డిశ్చార్జ్‌ అవుతారని తెలియజేశారు.


By November 16, 2019 at 09:17AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/spb-says-lata-mangeshkar-getting-better-dont-listen-to-rumour/articleshow/72080625.cms

No comments