ఒంటరిగా ఉన్న 85ఏళ్ల వృద్ధురాలిపై అత్యాచారం

దేశంలో ఎక్కడ చూసిన మహిళలపై అఘాయిత్యాలు, అత్యాచారాలు నిత్యం వెలుగుచూస్తూనే ఉన్నాయి. పసిపిల్లల నుంచి కాటికి కాళ్లు చాపిన ముసలివాళ్ల వరకు ఎవరినీ కామాంధులు వదలడం లేదు. తాజాగా ఛత్తీస్గఢ్లో 85ఏళ్ల వృద్ధురాలిపై 22ఏళ్ల యువకుడు అత్యాచారానికి పాల్పడటం కలకలం రేపింది. Also Read: జంగీర్ చంపా జిల్లాలోని నైలా చౌకీ ప్రాంతానికి చెందిన ఓ వృద్ధురాలు(85) సోమవారం రాత్రి ఇంట్లో ఒంటరిగా నిద్రిస్తోంది. అదే గ్రామానికి చెందిన ఓ యువకుడు(22) రాత్రి దొంగతనంగా ఇంట్లోకి దూరి వృద్ధురాలిని బెదిరించి అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధితురాలి కేకలు విన్న స్థానికులు తలుపు పగులగొట్టి లోనికి రావడంతో నిందితుడు పరారయ్యాడు. Also Read: బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. అతడు నేరం అంగీకరించడంతో జ్యుడిషియల్ కస్టడీకి పంపారు. బాధితురాలిని వైద్య పరీక్షల నిమిత్తం స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. Also Read:
By November 06, 2019 at 09:22AM
No comments