గొంతు కోసి అతి కిరాతకంగా 20ఏళ్ల యువతి దారుణహత్య

కర్ణాటకలోని దొడ్డబళ్లాపురం పరిధిలో యువతి దారుణహత్యకు గురైంది. లింగనహళ్లి గ్రామంలో మేకలు మేపుకుంటున్న యువతిని కొందరు దుండగులు గొంతు కోసి కిరాతకంగా చేశారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. Also Read: లింగనహళ్లి గ్రామానికి చెందిన అంజలి(20) కుటుంబం మేకలు పెంచి అమ్ముకుని జీవిస్తుంటుంది. అంజలి రోజూ మేకలను సమీపంలోని అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి మేపుకుని తీసుకొస్తుంటుంది. ఈ నేపథ్యంలోనే మంగళవారం మేకలను తీసుకుని వెళ్లిన ఆమె తిరిగిరాలేదు. దీంతో తల్లిదండ్రులు ఆందోళనపడి వెతకసాగారు. ఓ నిర్మానుష్య ప్రాంతంలో అంజలి రక్తపు మడుగులో పడి ఉండటాన్ని చూసి వెంటనే ఆస్పత్రికి తరలించారు. అయితే అంజలి అప్పటికే చనిపోయినట్లు డాక్టర్లు తెలిపారు. యువతి గొంతు కోయడంతో తీవ్ర రక్తస్రావమై చనిపోయిందని పోస్టుమార్టం రిపోర్టులో వెల్లడైంది. Also Read: ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. హత్యకు ముందు అంజలిపై అత్యాచారయత్నం జరిగిందా? ప్రతిఘటించడంతోనే చంపేశారా? అన్న కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. ఇంతటి దారుణానికి పాల్పడింది ఎవరా? అని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే యువతి కుటుంబసభ్యులు, గ్రామస్థులు మాత్రం అదే గ్రామానికి చెందిన ఓ యువకుడిపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అతడు గతంలో ఎన్నోసార్లు ప్రేమ పేరుతో అంజలి వెంటపడి వేధించాడని చెబుతున్నారు. Also Read:
By November 13, 2019 at 09:17AM
No comments