కాకినాడలో కిరాతకం.. రూ.2కోసం వ్యక్తి హత్య

కాకినాడలో దారుణ ఘటన వెలుగుచూసింది. కేవలం రూ.2ల విషయంలో తలెత్తిన వివాదం ఓ వ్యక్తి ప్రాణం తీసింది. కాకినాడలోని వలసపాక ప్రాంతంలో సాంబ అనే వ్యక్తి సైకిల్ షాపు నిర్వహిస్తున్నాడు. ఆదివారం ఉదయం సువర్ణరాజు అనే యువకుడు షాపుకు వచ్చి సైకిల్‌కు గాలి కొట్టించుకున్నాడు. అతడిని రెండు రూపాయలు ఇవ్వాలని సాంబ కోరగా తిట్టాడు. డబ్బులు ఇవ్వనని చెప్పి సాంబతో గొడవపడి చేయి చేసుకున్నాడు. Also Read: ఆ సమయంలో షాపు వద్దనే ఉన్న సాంబ స్నేహితుడు అప్పారావు ఆవేశంతో రెచ్చిపోయాడు. కత్తితో సువర్ణరాజును విచక్షణా రహితంగా పొడిచాడు. తీవ్ర రక్తస్రావంతో బాధితుడు అక్కడే కుప్పకూలిపోయాడు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి హుటాహుటిన చేరుకుని సువర్ణరాజును ఆస్పత్రికి తరలించారు. Also Read: డాక్టర్లు చికిత్స అందిస్తుండగానే పరిస్థితి విషమించి సువర్ణరాజు ప్రాణాలు కోల్పోయాడు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడు అప్పారావు పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనతో నగరం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. Also Read:
By November 10, 2019 at 10:44AM
No comments