Breaking News

చెల్లెలిని కిడ్నాప్ చేసి రేప్.. యువకుడికి 17ఏళ్ల జైలుశిక్ష


వరుసకు చెల్లెలు అయ్యే బాలికను అపహరించి అత్యాచారానికి పాల్పడిన యువకుడి న్యాయస్థానం తగిన శిక్ష విధించింది. 19ఏళ్ల ఆ కామాంధుడికి 17ఏళ్ల జైలుశిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది. వావివరుసలు మరిచి అఘాయిత్యానికి పాల్పడిన దోషిపై కోర్టుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. Also Read: తమిళనాడులోని దిండుక్కల్ జిల్లాలోని ఓ గ్రామానికి చెందిన యువకుడు(19) తనకు చెల్లెలి వరుసయ్యే బాలిక(16)పై కన్నేశాడు. 2018, మే 21వ తేదీన ఆమెకు మాయమాటలు చెప్పి కిడ్నాప్ చేశాడు. నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధితురాలు వదిలేయాలని వేడుకున్నా కనికరించకుండా తన పశువాంఛను తీర్చుకున్నాడు. బాధితురాలు అపస్మారక స్థితికి వెళ్లిపోవడంతో ఆమెను అక్కడే నగ్నంగా వదిలేసి వెళ్లిపోయాడు. Also Read: కాసేపటి తర్వాత తేరుకున్న బాధితురాలు ఇంటికి వెళ్లి విషయం చెప్పడంతో ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తులో అతడు నేరం చేసినట్లు తేలడంతో దిండుక్కల్ మహిళా కోర్టు బుధవారం తీర్పు వెలువరించింది. కిడ్నాప్ చేసినందుకు ఏడేళ్లు, అత్యాచారానికి పదేళ్లు.. మొత్తం 17ఏళ్ల జైలుశిక్ష విధిస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పారు. రూ.5వేల జరిమానా కూడా విధించారు. Also Read:


By November 07, 2019 at 09:12AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/tamilnadu-young-man-gets-17-yr-prison-due-to-rape-on-sister/articleshow/71948587.cms

No comments