`ఆర్‌ఎక్స్ 100` హీరోతో `90 ఎంఎల్`.. రిలీజ్‌కు రెడీ అయిన మరో బోల్డ్ మూవీ

ఆర్‌ఎక్స్100 సినిమాతో అందరి దృష్టిని ఆకర్షించిన హీరోగా తెరకెక్కుతున్న మరో డిఫరెంట్ మూవీ . తరువాత ఆ స్థాయిలో సక్సెస్ సాధించటంలో ఫెయిల్ అవుతున్న కార్తికేయ ఈ సినిమాతో తిరిగి ఫాంలోకి రావాలని ప్లాన్ చేస్తున్నాడు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న 90 ఎంఎల్ ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్‌ను ప్రకటించారు చిత్రయూనిట్. ఆర్‌ఎక్స్ 100 సినిమాను నిర్మించిన కార్తికేయ క్రియేటివ్ వర్క్స్ సంస్థ ఈ సినిమాను కూడా నిర్మిస్తోంది. ఈ సినిమాతో శేఖర్ రెడ్డి ఎర్ర దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. కార్తీకేయ సరసన నేహా సోలంకి హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ థియేట్రికల్ రైట్స్ ని శ్రీ వైష్ణవి ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ ఫ్యాన్సీ ఆఫర్‌కి సొంతం చేసుకున్నట్టుగా చిత్రయూనిట్ వెల్లడించారు. Also Read: ఈ సందర్భంగా నిర్మాత అశోక్‌రెడ్డి గుమ్మకొండ మాట్లాడుతూ... `ముందస్తు ప్రణాళిక ప్రకారం అన్నీ సవ్యంగా జరుగుతున్నాయి. షూటింగ్ పూర్తయింది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు తుది దశకు చేరుకున్నాయి. 90.ఎంఎల్ అనే టైటిల్‌కి తగ్గట్టుగానే సినిమా కూడా వైవిధ్యంగా ఉంటుంది. కమర్షియల్ అంశాలు పుష్కలంగా ఉంటాయి. ఆద్యంతం వినోదాత్మకంగా సాగుతుంది. Also Read: విజువల్‌గానూ సినిమా రిచ్‌గా ఉంటుంది. ఇటీవల అజర్‌బైజాన్‌లో మూడు పాటలను చిత్రీకరించాం. సినిమా గురించి మంచి పాజిటివ్ బజ్ క్రియేట్ అయింది. శ్రీ వైష్ణవి ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ ఫ్యాన్సీ ఆఫర్ కి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ థియేట్రికల్ రైట్స్ ని సొంతం చేసుకుంది. డిసెంబర్ 5న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాం` అన్నారు. చిత్ర దర్శకుడు శేఖర్ రెడ్డి ఎర్ర మాట్లాడుతూ `ఆర్‌ఎక్స్ 100లో కార్తికేయను చూడగానే 90 ఎంఎల్ స్క్రిప్ట్ కి పక్కాగా సరిపోయే హీరో ఇతనే అనిపించింది. డిసెంబర్ 5న థియేటర్లలో సినిమా చూసిన వారు కూడా కార్తికేయకు ఈ సినిమా టైలర్ మేడ్ కేరక్టర్ అని ఫీలవుతారు. రీసెంట్‌గా అజర్‌బైజాన్‌లో మూడు పాటలను చిత్రీకరించాం. ఆ పాటలు సినిమాకు హైలైట్ అవుతాయి. ఇటీవల విడుదల చేసిన రెండు పాటలకు చాలా మంచి స్పందన వస్తోంది. యూత్‌ఫుల్‌గా సాగే సినిమా ఇది` అని చెప్పారు. Also Read:
By November 12, 2019 at 10:12AM
No comments