Breaking News

ISIS ఉగ్రవాది బాగ్దాదీని మట్టుబెట్టారిలా.. వీడియోలు రిలీజ్ చేసిన పెంటగాన్


సిరియాలోని ఇడ్లీబ్‌లో ఐసిస్ చీఫ్ అబు బకర్‌ అల్‌ బాగ్దాదీని మట్టుబెట్టిన అమెరికా.. ఆ ఆపరేషన్‌కి సంబంధించిన వీడియోలు, ఫొటోలను బయటపెట్టింది. యూఎస్ సెంట్రల్ కమాండ్ ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా వీటిని రిలీజ్ చేశారు. ఉన్న ఇంటిని అమెరికా బలగాలు మెల్లగా చుట్టుముడుతుండటాన్ని ఈ వీడియాలో చూడొచ్చు. పెంటగాన్‌లో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అమెరికా సెంట్రల్‌ కమాండ్ కమాండర్‌ కెన్నెత్‌ మెకంజీ దాడికి సంబంధించిన విషయాలను వెల్లడించారు. దాడికి ముందు ఆ బాగ్దాదీ ఆశ్రయం పొందిన ఇల్లు ఎలా ఉంది.. తర్వాత ఆ ప్రాంతం ఎలా మారిందో కూడా వీడియోలో చూడొచ్చు. బాగ్గాదీ హతమైన తర్వాత... ఆ ఇంటిని పూర్తిగా నేలమట్టం చేసినట్లు ప్రకటించింది. అమెరికా బలగాలు చుట్టుముట్టడంతో.. బాగ్దాదీ ఆత్మాహుతికి పాల్పడగా.. ఆయనతోపాటు ఇద్దరు పిల్లలు కూడా చనిపోయారని తెలిపింది. బాగ్దాదీతోపాటు ముగ్గురు చిన్నారులు చనిపోయారని గతంలో ట్రంప్ ప్రకటించారు. కానీ చనిపోయింది ఇద్దరేనని, వారి వయసు 12 ఏళ్లలోపేనని తాజాగా ప్రకటించారు. అమెరికా బలగాలు చుట్టుముట్టడంతో.. సొరంగంలోకి ప్రవేశించిన బాగ్దాదీ.. వారిపై కాల్పులు జరిపాడు. తప్పించుకునేందుకు వీలు లేకపోవడంతో.. ఆత్మాహుతి చేసుకున్నాడు. కాంపౌండ్‌లో ఉన్న నలుగురు మహిళలు, ఇద్దరు పురుషులు కూడా చనిపోయారని మెకంజీ తెలిపారు. బాగ్దాదీ చెర నుంచి 11 మంది చిన్నారులను కాపాడిన సైన్యం.. ఇద్దరు పురుషులను అదుపులోకి తీసుకుంది. సైన్యం బాగ్దాదీ ఇంటికి చేరుకునే సమయంలో ఉగ్రవాదులు సైనిక హెలికాప్టర్లపైకి కాల్పులు జరిపారు. ఈ క్రమంలో తాము కూడా దాడులు వైమానిక జరిపామని మెకంజీ వెల్లడించారు. ఈ దాడుల్లో ఎంత మంది హతమైంది చెప్పలేమన్నారు. తమ దాడిలో బాగ్దాదీ చనిపోయారని.. డీఎన్ఏ పరీక్షలోనూ ఈ విషయం రుజువైందన్నారు. 2004లో ఇరాక్‌ జైల్లో బాగ్దాదీని బంధించిన అమెరికా.. అప్పట్లోనే అతడి డీఎన్ఏ వివరాలను సేకరించింది. బాగ్దాదీ హతమయ్యాక.. అతడి అవశేషాల్ని 24 గంటల్లోగా సముద్రంలో ఖననం చేశామని మెకంజీ తెలిపారు.


By October 31, 2019 at 10:01AM


Read More https://telugu.samayam.com/latest-news/international-news/pentagon-releases-footage-and-details-on-isis-leader-al-baghdadi-raid/articleshow/71830847.cms

No comments