హైదరాబాద్లో భారీ చోరీ.. 5.5కిలోల బంగారం ఎత్తుకెళ్లిన దొంగలు

నగరంలో దొంగలు మరోసారి రెచ్చిపోయారు. బోయిన్పల్లి పోలీస్స్టేషన్ పరిధిలోని ఓ ఇంట్లోకి చొరబడిన దుండగులు బంగారు, వెండి నగలతో పాటు భారీగా నగదు దోచుకుపోయారు. Also Read: ఓల్డ్ బోయిన్పల్లిలోని మల్లికార్జున్నగర్లో నివసించే సరళ అనే మహిళ వడ్డీ వ్యాపారం చేస్తుంటారు. అప్పు కావాల్సిన వారి వద్దనుంచి బంగారు, వెండి వస్తువులను తాకట్టు పెట్టుకుని రుణం ఇస్తుంటారు. దీంతో ఆమె ఇంట్లో భారీగా ఆభరణాలు ఉంటాయి. ఈ విషయాన్ని పసిగట్టిన దొంగలు సోమవారం ఆమె ఇంటిని దోచేశారు. సోమవారం ఓ పని నిమిత్తం బయటకు వెళ్లిన సరళ ఇంటికి వచ్చి తాళం తీసుకుని లోపలికి వెళ్లారు. Also Read: ఇంట్లోకి ఎవరో వచ్చినట్లు ఆమెకు అనుమానం కలగడంతో బీరువా తెరిచి చూసింది. లోపల ఉన్న బంగారు, వెండి ఆభరణాలతో పాటు నగదు కూడా కనిపించలేదు. దీంతో షాకైన ఆమె వెంటనే బోయిన్పల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. 5.5కిలోల బంగారం, 7కిలోల వెండితో పాటు రూ.18లక్షల నగదు చోరీకి గురైనట్లు సరళ ఫిర్యాదులో పేర్కొంది. అయితే బాధితురాలు ఫిర్యాదులో పేర్కొన్నట్లు అంత బంగారం, నగదు చోరీకి గురైందా? అని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇంటి తాళాలు వేసినట్లు ఉండగానే దొంగతనం జరగడంతో ఇది తెలిసిన వారి పనేనా? అన్న అనుమానాలు కలుగుతున్నాయి. చోరీకి గురైన ఇంటిని బేగంపేట ఏసీపీ రాంరెడ్డి పరిశీలించారు. Also Read:
By October 22, 2019 at 08:49AM
No comments