Breaking News

‘క్రాస్ మసాజ్ చేస్తే రూ.500, వ్యభిచారానికి రూ.3వేలు’ స్పా సెంటర్ యజమాని వేధింపులు


బ్యూటీపార్లర్‌లో ఉద్యోగం పేరుతో ఇద్దరు యువతులకు ఉపాధి కల్పించిన ఓ వ్యక్తి వారిని వ్యభిచారం చేయాలంటూ వేధిస్తున్న ఘటన వెలుగులోకి వచ్చింది. పార్లర్‌లో వారితో మగవారికి మసాజ్ చేయిస్తా వేతనం కూడా సరిగా ఇవ్వడం లేదు. ఇదేంటని నిలదీస్తే వారిని వ్యభిచారం చేస్తే భారీగా డబ్బులు ముట్టజెప్పుతానని బెదిరిస్తున్నాడు. దీనిపై ఇద్దరు యువతులు పశ్చిమ మండలం డీసీపీ సుమతికి ఫిర్యాదు చేశారు. Also Read: ధరంకరం రోడ్డులో ప్రకాష్‌ అనే వ్యక్తి జయశ్రీ ఆయుర్వేదిక్‌ స్పా (మసాజ్‌) సెంటర్‌ నిర్వహిస్తున్నాడు. బ్యూటీ పార్లర్‌లో పనిచేసేందుకు యువతులు కావాలని కొద్ది నెలల క్రితం ఓఎల్‌ఎక్స్‌లో ప్రకటనలు ఇచ్చాడు. అందుకు ఆసక్తి చూపిన ఇద్దరు యువతులకు నెలకు రూ.18 వేలు వేతనం ఇస్తామని చెప్పి పనిలో పెట్టుకున్నాడు. వారితో క్రాస్‌ మసాజ్‌ చేయిస్తూ రోజుకు రూ.500 మాత్రమే ఇచ్చేవాడు. బ్యూటీపార్లర్‌లో ఉద్యోగం అని చెప్పి తమతో మగవారికి మసాజ్ చేయించడమేంటని ఆ అమ్మాయిలు కొద్దిరోజుల క్రితం ప్రకాష్‌ను నిలదీశారు. Also Read: దీంతో ప్రకాశ్ ఆ అమ్మాయిలను వేధింపులకు గురిచేశాడు. మసాజ్ కాకుండా స్పాకు వచ్చే మగవారిని లైంగికంగా తృప్తి పరిస్తే రోజుకు రూ.2-3వేలు ఇస్తానని ఒత్తిడి చేశారు. తాను చెప్పిన మాట వినకపోతే మగవాళ్లకు మసాజ్ చేస్తున్న సమయంలో తీసిన ఫోటోలను మీ కుటుంబసభ్యులకు పంపిస్తానని బెదిరించాడు. దీంతో బెదిరిపోయిన యువతులు బుధవారం వెస్ట్‌జోన్ డీసీపీ సుమతికి ఫిర్యాదు చేశారు. తమ కుటుంబ ఆర్థిక పరిస్థితులు సరిగా లేని కారణంగా తమకు ఉద్యోగం చేయడం అత్యంత అవసరమని, దాన్ని అడ్డం పెట్టుకుని ప్రకాష్ వ్యభిచారం చేయాలంటూ వేధిస్తున్నాడని, అతడి బారి నుంచి తమను రక్షించాలని వేడుకున్నారు. డీసీపీ ఆదేశాలతో ఎస్‌ఆర్ నగర్ పోలీసులు ప్రకాశ్‌పై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. Also Read:


By October 24, 2019 at 08:55AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/ameerpet-spa-owner-arrested-for-harassing-two-women-for-prostitution/articleshow/71732523.cms

No comments