Breaking News

ఈ స్టూడియో చరిత్ర ఇక గతమేనా?


కొన్ని కొన్ని స్థలాలు, వ్యక్తులు చరిత్ర ఉన్నంత వరకు లెజెండరీగానే ఉంటారు. అలాంటిదే బాలీవుడ్‌లో ఓ వెలుగు వెలిగిన ఆర్కే స్టూడియో. రాజ్‌కపూర్‌కి చెందిన ఈ స్టూడియో మీద ఎన్నో చిత్రాలు నిర్మితం అయ్యాయి. ఇక ఈ స్టూడియో నిత్యం షూటింగ్‌లతో ఎంతో బిజీగా ఉండేది. ఆర్‌.కె. స్టూడియోస్‌ అంటేనే అది సినీ ప్రేక్షకుల్లో ఓ బ్రాండ్‌గా పేరు తెచ్చుకుంది. రాజ్‌కపూర్‌ కుటుంబీకులందరు దీనితో ఎంతో సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్నారు. కానీ రాజ్‌కపూర్‌ మరణం తర్వాత ఈ స్టూడియో ప్రాభవం తగ్గుతూ వచ్చింది. తెలుగులో డి.రామానాయుడు, అన్నపూర్ణ, పద్మాలయా స్టూడియోస్‌లాగా ఇది బాలీవుడ్‌లో కలకాలం అదే వైభవంతో ఉండి పోతుందని నిన్నటితరం ప్రేక్షకులు, అభిమానులు కలలు గన్నారు. ముంబైలోని చెంబూరులో ఈ స్టూడియోని నిర్మించారు. 

ఒకప్పుడు ఓ వెలుగు వెలిగిన ఈ స్టూడియోలో 2017లో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. కానీ రాజ్‌కపూర్‌ వారసులెవ్వరు దానిని తిరిగి పున:నిర్మించడానికి, పూర్వవైభవం కల్పించేందుకు, తమ తాతల జ్ఞాపకాలను పదిల పరుచుకునే ప్రయత్నం చేయలేదు. దాంతో అది ఒక అనామక ప్రాంతంగా, ఎవ్వరూ పట్టించుకోని స్టూడియోగా మిగిలిపోయింది. అలాంటి ఘన చరిత్ర ఉన్న స్టూడియోను ప్రముఖ పారిశ్రామిక సంస్థ అయిన గోద్రేజ్‌ సొంతం చేసుకుంది. దీనికి సంబంధించిన ఆర్ధిక లావాదేవీలు పూర్తి అయ్యాయి. ఎంత ధరకు ఈ స్టూడియోను గోద్రేజ్‌ సంస్థ సొంతం చేసుకుందనే విషయం మాత్రం బయటకు రాలేదు. 

ఈ స్టూడియోను సొంతం చేసుకునేందుకు పలు సంస్థలు విపరీతంగా పోటీ పడినా చివరకు గోద్రేజ్‌ సంస్థ చేతికి ఇది దక్కింది. ఈ సంస్థ ఎగ్జిక్యూటివ్‌ ఛైర్మన్‌ ఫిరోజ్‌షా గోద్రేజ్‌ ఈ స్టూడియోను సొంతం చేసుకున్న తర్వాత ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. మా వ్యూహాలకు సరిగ్గా సరిపోయేలా ఈ స్టూడియో ఉంది. అదే సమయంలో ఈ స్టూడియోకు కీర్తి ప్రతిష్టలకు ఏమాత్రం భంగం వాటిల్లకుండా చూసుకుంటామని హామీ ఇచ్చాడు. అయినా డబ్బులతో కపూర్‌ ఫ్యామిలీకి అంత అవసరమా? ఈ స్టూడియోను డబ్బుల కోసం అమ్మితే తమ పూర్వీకుల ఆత్మలు ఘోషిస్తాయని కూడా రాజ్‌కపూర్‌ ఫ్యామిలీకి చెందిన ఎవ్వరూ ఆలోచించకపోవడం దారుణమని బిటౌన్‌లో విమర్శల పరంపర కొనసాగుతోంది. ఇది నిజమే మరి..! 



By May 07, 2019 at 02:22AM


Read More http://www.cinejosh.com/news-in-telugu/4/45826/godrej-properties.html

No comments