Breaking News

జక్కన్న, సుక్కు, త్రివిక్రమ్.. మహేష్ నెక్స్ట్ అర్డర్!


మహేష్‌బాబు ‘బ్రహ్మోత్సవం, స్పైడర్‌’ వంటి ఫ్లాప్‌ల తర్వాత ‘భరత్‌ అనే నేను’తో సూపర్‌హిట్‌ కొట్టాడు.. ఇక ఆయన ప్రతిష్టాత్మక 25వ చిత్రంగా దిల్‌రాజు, అశ్వనీదత్‌, పివిపిలతో వంశీపైడిపల్లి దర్శకత్వంలో చేసిన ‘మహర్షి’ చిత్రం ఈనెల 9న విడుదల కానుంది. మొదట ‘మహర్షి’ తర్వాత మైత్రి మూవీ మేకర్స్‌ బేనర్‌లో మహేష్‌-సుకుమార్‌ల చిత్రం ఉంటుందని అధికారికంగా ప్రకటించారు. కానీ మహేష్‌ సడన్‌గా దానిని పక్కన పెట్టి అనిల్‌రావిపూడి చిత్రం ఓకే చేశాడు. దిల్‌రాజు, అనిల్‌సుంకర నిర్మాతలుగా ఈ చిత్రం రూపొందనుంది. ఇక ‘మహర్షి’ వేడుకలో మహేష్‌ మాట్లాడుతూ, ఈరోజుల్లో దర్శకులు రెండు నెలలు కూడా ఆగలేకపోతున్నారని కామెంట్‌ చేశాడు. దాంతో ఇవి సుకుమార్‌ని ఉద్దేశించే అని ప్రచారం జరిగింది. 

దానిపై తాజాగా మహేష్‌ క్లారిటీ ఇచ్చాడు. నేను సుకుమార్‌ని ఉద్దేశించి అలా అనలేదు. ‘మహర్షి’ చిత్రం తర్వాత నేను ఓ ఎంటర్‌టైన్‌మెంట్‌ చిత్రం చేయాలని భావించాను. కానీ సుక్కు చెప్పిన సబ్జెక్ట్‌ కూడా సీరియస్‌గా ఉంది. దాంతో అనిల్‌రావిపూడి చిత్రాన్ని ఓకే చేశాను. నా నిర్ణయాన్ని సుకుమార్‌ కూడా మెచ్చుకున్నాడు. త్వరలో సుకుమార్‌తో చిత్రం చేస్తానని క్లారిటీ ఇచ్చాడు. అయితే ఈ చిత్రం ఎప్పుడు ఉండేది చెప్పలేదు.. కానీ అదే మహేష్‌ రాజమౌళి చిత్రం గురించి మాత్రం ఆసక్తికర కామెంట్స్‌ చేశాడు. రాజమౌళితో చిత్రం ఉంటుంది. ప్రస్తుతం కథాచర్చలు జరుగుతున్నాయి. త్వరలో అధికారిక ప్రకటన ఉంటుందని చెప్పాడు. 

దీంతో మహేష్‌ అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. మొదట ‘బాహుబలి’ తర్వాత రాజమౌళి మహేష్‌తో కె.ఎల్‌ నారాయణ నిర్మాతగా దుర్గాఆర్ట్స్‌ బేనర్‌లో ఓ చిత్రం చేస్తాడని వార్తలు వచ్చాయి. కానీ రాజమౌళి ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ మూవీ చేస్తున్నాడు. దీని తర్వాత రాజమౌళి మహేష్‌తోనే చేస్తాడని క్లారిటీ వచ్చింది. ఇక త్రివిక్రమ్‌ ప్రస్తుతం అల్లుఅర్జున్‌తో ఓ చిత్రం చేయనున్నాడు. దీని తర్వాత మెగాస్టార్‌ చిరంజీవితో చేసిన తర్వాత మరోమారు త్రివిక్రమ్‌-మహేష్‌ కాంబోలో ‘అతడు, ఖలేజా’ తర్వాత మూడో చిత్రం రానుంది.



By May 06, 2019 at 10:49AM


Read More http://www.cinejosh.com/news-in-telugu/4/45821/mahesh-babu.html

No comments