Breaking News

వెంకీ నో అంటున్నాడు.....!


విక్టరీ వెంకటేష్‌ కెరీర్‌లో అతి పెద్ద హిట్స్‌ అన్నీ దాదాపు రీమేక్‌లే. అంతగా ఆయన వాటిని నమ్ముతారు. ఇటీవల కూడా ఆయన మసాలా, గురు వంటి రీమేక్స్‌లో నటించాడు. ఇక విషయానికి వస్తే తమిళంలో మాధవన్‌, విజయ్‌సేతుపతి నటించగా, గాయత్రి పుష్కర్‌ దర్శకత్వంలో వచ్చిన విక్రమ్‌ వేదా చిత్రం ఎంతటి ఘన విజయం సాధించిందో తెలిసిందే. తమిళం భాష తెలియని వారు కూడా ఆ చిత్రం చూసి ఫిదా అయ్యారు. ఈ చిత్రాన్ని వెంకటేష్‌, రానాలు కలిసి రీమేక్‌ చేస్తే అద్భుతంగా ఉంటుందని పలువురి సినీ లవర్స్‌ అభిప్రాయపడుతున్నారు. కనీసం మాధవన్‌గా నాగార్జున నటించినా బాగుంటుందని ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి. 

తాజాగా మాధవన్‌ పాత్రలో వెంకటేష్‌, విజయ్‌సేతుపతి పాత్రలో నారారోహిత్‌లు నటిస్తారని వార్తలు రావడంతో ఈ చిత్రం ప్రేమికులు ఎంతో సంతోషపడ్డారు. కానీ ఈ ఆశలపై వెంకటేష్‌ సోదరుడు, నిర్మాత సురేష్‌బాబు వెంటనే స్పందించాడు. ప్రస్తుతం వెంకీ నాగచైతన్యతో కలిసి బాబి దర్శకత్వంలో వెంకీ మామ చిత్రంలో నటిస్తున్నాడని, తదుపరి ఏ చిత్రంలో నటిస్తాడో తామే అఫీషియల్‌గా ప్రకటిస్తామని తెలిపాడు. నిజానికి ఎఫ్‌2, వెంకీమామ వంటి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్స్‌ తర్వాత విక్రమ్‌ వేదా వంటి చిత్రం చేస్తే వెంకీకి వెరైటీగా ఉంటుంది. 

కానీ నారా రోహిత్‌ బదులు అది రానా చేస్తేనే మరింత బాగుంటుంది. ఇంత మంచి సినిమాని అందునా విక్టరీ వెంకటేష్‌, అబ్బాయ్‌ రానాలు కలిసి నటించే అవకాశం ఈ చిత్రం రూపంలో ఉన్నా ఎందుకు సురేష్‌ కాంపౌండ్‌ ఈ చిత్రానికి నో చెబుతున్నారనేది అర్ధం కాని విషయమే. ఇంతకీ అసలు వేరే వారితో అయినా ఈ చిత్రం తెలుగు ప్రేక్షకులను అలరిస్తుందా? లేదా? అన్నది మిలియన్‌ డాలర్ల ప్రశ్నేనని చెప్పాలి.



By May 09, 2019 at 04:40PM


Read More http://www.cinejosh.com/news-in-telugu/4/45868/venkatesh.html

No comments