Breaking News

సుక్కూని అనలేదు: మహేష్ బాబు


మహేష్ బాబు మహర్షి ఫంక్షన్ లో వంశి పైడిపల్లిని పొగిడితే... వంశీని పొగిడింది.. సుకుమార్ కి సెటైర్ వెయ్యడానికే అంటూ మీడియాలో గూడార్ధాలతో వార్తలు అల్లేశారు. సుకుమార్ తో మహేష్ సినిమా ఆగిపోయిన నేపథ్యంలో... మహేష్ బాబు మహర్షి ఈవెంట్ లో మహర్షి దర్శకుడు వంశి పైడిపల్లిని పొగుడుతూ... తన కోసం వంశీ మూడేళ్లు నిరీక్షించాడని, వేరే డైరెక్టర్ ఎవరన్నా అయితే తన కోసం ఆగకుండా వేరే హీరోని వెతుక్కునేవారంటూ... సుకుమార్ ని ఉద్దేశించే ఆ డైలాగ్ చెప్పాడంటూ.. మీడియాలో కథనాలు రావడమే కాదు...... రీసెంట్ గా మహర్షి ఇంటర్వూస్ లో మీడియా వారినుండి అదే ప్రశ్న ఎదురవగా... దానికి మహేష్ తెలివైన సమాధానం చెప్పాడు.

వంశీ పైడిపల్లిని తాను పొగిడాను కానీ.. సుకుమార్ ని ఏం అనలేదని... ఆ విషయంలో మీడియా గూడార్ధాలు వెతకొద్దని... సుకుమార్ తనకి నేనొక్కడినే లాంటి మంచి చిత్రం ఇచ్చాడని, రంగస్థలం తర్వాత తామిద్దరం ఒక సినిమా చేద్దామనుకున్నామని.. కానీ ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో సేఫ్ జోన్‌లోంచి బ‌య‌ట‌కు వ‌చ్చి.... ఎంట‌ర్‌టైన్‌మెంట్ సినిమా చేయాల‌న్న ఉద్దేశంతోనే అనిల్ రావిపూడి క‌థ‌కు ఓకే చెప్పాన‌ని... ఈలోపు సుకుమార్ కూడా మరో సినిమా చేసి వస్తామన్నాడు. తర్వాత మేమిద్దరం కలిసి సినిమా చేద్దామని అనుకున్నామని.. సో త్వరలోనే తమ కాంబోలో మూవీ ఉందని మహేష్ చెప్పాడు. మరి అలా సుకుమార్ తో తనకెలాంటి క్లాష్ లేదని మహేష్ క్లారిటీ ఇచ్చాడు.  



By May 05, 2019 at 11:54AM


Read More http://www.cinejosh.com/news-in-telugu/4/45809/mahesh-babu.html

No comments