Breaking News

చిన్ననాటి స్కూల్లో చరణ్.. ఫ్యాన్స్ హ్యాపీ!


ఒకవైపు మెగాపవర్‌స్టార్‌గా వరుస చిత్రాలు, మరోవైపు తన సొంత ఫ్యామిలీ బేనర్‌ అయిన ‘కొణిదెల’ ప్రొడక్షన్స్‌లో తన తండ్రి మెగాస్టార్‌ చిరంజీవితో ‘ఖైదీనెంబర్‌ 150’, ప్రస్తుతం ‘బాహుబలి’ని టార్గెట్‌ చేస్తూ అన్‌లిమిటెడ్‌ బడ్జెట్‌తో నాన్న డ్రీమ్‌ ప్రాజెక్ట్‌ అయిన తొలి తెలుగు స్వాతంత్య్రసమరయోధుడు, రాయలసీమ ముద్దుబిడ్డ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి బయోపిక్‌గా సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో ‘సై..రా..నరసింహారెడ్డి’ నిర్మాణం. ఇందులో అమితాబ్‌బచ్చన్‌, విజయ్‌ సేతుపతి, నయనతార, కిచ్చాసుదీప్‌, తమన్నా, జగపతిబాబు ఇలా భారీ నిర్మాణంతో అలుపెరుగని పనులు, మరోవైపు కోకాపేటలో వేసిన ‘సై..రా..నరసింహారెడ్డి’ సెట్‌ అగ్నికి ఆహుతి కావడం, దానికి సంబంధించిన ఇన్స్యూరెన్స్ పనులు, తదుపరి చిత్రంగా మ్యాట్నీ మూవీస్‌ భాగస్వామ్యంంలో కొరటాల శివ దర్శకత్వంలో తండ్రితో నిర్మించే చిత్రం ప్రీపొడక్షన్‌ పనులు, ‘వినయ విధేయ రామ’ డిజాస్టర్‌ ఫలితం, ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ షూటింగ్‌.. ఇలా పలు బాధ్యతలతో మెగా పవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌ తలమునకలై ఉన్నాడు. 

అయితే ఇదే సమయంలో ఆయన తన బాల్యం నాటి జ్ఞాపకాల కోసం, నాటి మధుర స్మృతులను జ్ఞాపకం చేసుకుంటూ తాను చిన్ననాడు చదివిన పాఠశాలను దర్శించుకున్నాడు. ఇక విషయానికి వస్తే చిన్ననాటి పాఠశాల జ్ఞాపకాలను ఎందరోపదిలంగా చూసుకుంటారు. వాటిని జీవితంలో అపురూపంగా భావిస్తారు. రామ్‌చరణ్‌ కూడా బాల్యంలో తాను చదివిన స్కూల్‌కి వెళ్లి అక్కడ తాను గడిపిన క్షణాలను జ్ఞాపకం చేసుకుని భావోద్వేగ భరితుడయ్యాడు. తెలుగు చిత్ర పరిశ్రమ నాడు మద్రాస్‌ నగరంలో ఉన్నప్పుడు చిరంజీవి తన కుమారుడు రామ్‌చరణ్‌ని తమిళనాడులోని లారెన్స్‌ లవ్‌డేల్‌ స్కూల్‌లో చదివించారు. ఆ తర్వాత పరిశ్రమ హైదరాబాద్‌ వచ్చేయడంతో మిగతా విద్యాభ్యాసం అంతా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనే జరిగింది. 

మరలా ఇన్నాళ్ల తర్వాత రామ్‌చరణ్‌ తాను చదువుకున్న చిన్ననాటి లారెన్స్‌ లవ్‌డేల్‌ స్కూల్‌కి వెళ్లాడు. అక్కడి మెస్‌, డార్మిటరీ, లాన్‌ వంటి పలు ప్రదేశాలలో కలియదిరిగి ఆనాటి జ్ఞాపకాలలో మునిగితేలాడు. దీని గురించి ఆయన భార్య ఉపాసన సోషల్‌మీడియాలో పోస్ట్‌లు పెట్టారు. ప్రతి ఒక్కరి జీవితంలో పాఠశాల జీవితం ఎంతో మధురమైనది. మరలా బాల్యంలోకి అడుగు పెట్టినట్లుగా ఉంది.. అని లారెన్స్‌ లవ్‌డేల్‌ స్కూల్‌ సందర్శన సందర్భంగా చెర్రీ వ్యాఖ్యానించాడు. 



By May 07, 2019 at 10:22AM


Read More http://www.cinejosh.com/news-in-telugu/4/45835/upasana.html

No comments