Breaking News

ఈసారి నాగార్జున దేవుడి పాత్రలో!


దైవభక్తి చిత్రాలను నిర్మించాలంటే ఎంతో గట్స్‌ కావాలి. పూర్వకాలంలో నాగయ్య నుంచి నందమూరి తారకరామారావు, అక్కినేని నాగేశ్వరరావు వంటి మహానటులు దైవం బ్యాక్‌డ్రాప్‌లో చేసిన చిత్రాలలో నటించి అద్భుతమైన విజయాలను అందుకున్నారు. ముఖ్యంగా దేవుడి పాత్రలు అంటే ఎన్టీఆర్‌ మాత్రమే గుర్తుకు వచ్చేలా ఆయన విజయం సాధించాడు. ఇక ఆ తర్వాతి తరంలో రాఘవేంద్రరావు-నాగార్జునలు ‘అన్నమయ్య, శ్రీరామదాసు, శిరిడీసాయి’ వంటి చిత్రాలను తీశారు. చాలా భాగం విజయం సాధించారు. ఇక దైవశక్తి, దుష్టశక్తుల నేపధ్యంలో సౌందర్య, అనుష్క, ప్రేమ వంటి వారితో కోడి రామకృష్ణ వంటి వారు పెద్దగా స్టార్‌ క్యాస్టింగ్‌ లేకుండానే గ్రాఫిక్స్‌ మాయాజాలంలో కణికట్టు చేశారు. అయితే ఇదంతా నాణానికి ఒకవైపు మాత్రమే. దైవం మీద వచ్చిన పలు చిత్రాల విషయంలో పలు ప్రాంతాలలో పలు సెంటిమెంట్లు ఉన్నాయి. ఉదాహరణకు తెలుగులో యముడిని కామెడీ చేసి చూపించిన ‘యమగోల, యమలీల’ వంటి చిత్రాలు అద్భుతమైన విజయం సాధించాయి. 

కానీ ఉత్తరాది వారు యముడిని ఎంతో భయంతో కొలుస్తారు. అందుకే ‘యమలీల’ వంటి చిత్రాన్ని చివరకు స్వయంగా వెంకటేష్‌ నటించి, బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చినా పరాజయమే పలకరించింది. అదే దక్షిణాది విషయానికి వస్తే శివుడి సెంటిమెంట్‌తో తీసిన చిత్రాలు ఏవీ పెద్దగా విజయం సాధించిన దాఖలాలు లేవు. ఎన్టీఆర్‌ నటించిన ‘దక్షయజ్ఞం’, మెగాస్టార్‌ చిరంజీవి శివుడి పాత్రను చేస్తూ, అర్జున్‌, సౌందర్య జంటగా నటించిన ‘శ్రీ మంజునాథ’, శ్రీనివాసరెడ్డి దర్శకత్వంలో నాగార్జున, అనుష్క నటించగా, ప్రకాష్‌రాజ్‌ శివునిగా నటించిన ‘ఢమరుకం’ వంటి చిత్రాలేవీ విజయం సాధించలేదు. 

ఇక విషయానికి వస్తే తాజాగా మరోసారి తమిళ, తెలుగు భాషల్లో శివుడి బ్యాక్‌డ్రాప్‌లో ఓ చిత్రం రూపొందుతోంది. ఈ చిత్రానికి కోలీవుడ్‌ యంగ్‌స్టార్‌ ధనుష్‌ దర్శకుడు కాగా ఇందులో నాగార్జున ఎంతో కీలకమైన శివుని పాత్రను పోషిస్తున్నాడని సమాచారం. ఈ చిత్రం షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది. ఈ చిత్రం షూటింగ్‌ సమయంలో గతంలో ఎన్టీఆర్‌లా, ధనుష్‌ కూడా ఎంతో నియమనిష్టలతో గడుపుతున్నాడని తెలుస్తోంది. ఇక ఇందులో శ్రీకాంత్‌-అదితిరావు-శరత్‌కుమార్‌లు కీలకపాత్రలను పోషిస్తున్నారు. 



By May 08, 2019 at 10:14AM


Read More http://www.cinejosh.com/news-in-telugu/4/45850/nagarjuna.html

No comments