Breaking News

AMB సినిమాస్ ఎలా నడుస్తుందో మహేష్ మాటల్లో!


మహేష్‌బాబు తన స్నేహితుడు సునీల్‌ నారంగ్‌తో కలిసి ఎఎంబీ మాల్‌ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. సినిమా థియేటర్లు కూడా ఇలా ఉంటాయా? అనిపించేలా ఫైవ్‌స్టార్‌ హోటళ్లను తలపించేలా ఆయన దానిని నిర్మించాడు. ఆరేళ్ల కిందట ‘1’(నేనొక్కడినే) చిత్రం సమయంలో తన తండ్రి కృష్ణతో సునీల్‌నారంగ్‌తో కలిసి మహేష్‌ ఇది ప్లాన్‌ చేశాడు. తన థియేటర్‌ సౌండింగ్‌ పరంగా, స్క్రీన్‌పరంగా అత్యుత్తమంగా ఉండేలా దానిని తీర్చిదిద్దాలని మహేష్‌ అనుకున్నది నేడు నిజమైంది. 

స్టార్‌ హోటల్స్‌ని తలపించేలా తన మాల్‌ ఉండాలని భావించానని అది నేడు నిజమైందని, నా కల సాకారం కావడంతో ఎంతో ఆనందంగా ఉందని మహేష్‌ అంటున్నాడు. తన థియేటర్‌లో ‘అవెంజర్స్‌’ మూవీ చూడాలని భావించానని, ఏడు గంటల షోకి టిక్కెట్లు కావాలని కోరితే అయిపోయాయని తెలిపారని నవ్వుతూ తెలిపాడు. మొత్తానికి మహేష్‌ కల సాకారం కావడం మాత్రమే కాదు... తన మాల్‌ ఎలా రన్‌ అవుతోంది అనేది కూడా మహేష్‌ ఇన్‌డైరెక్ట్‌గా తనకి కూడా టిక్కెట్లు దొరకడం లేదని చెప్పడం ద్వారా హింట్‌ ఇచ్చాడు. తాజాగా ఈ థియేటర్‌లో మహేష్‌ ‘అవేంజర్స్‌’ మూవీని చూశాడు. 

తన అనుభూతులను ఆయన ట్విట్టర్‌ ద్వారా తెలియజేస్తూ.. ‘‘అవేంజర్స్‌-ఎండ్‌గేమ్‌ ఎంతో బాగుంది. నేను సినిమా చూస్తూ ఎంతో ఎంజాయ్‌ చేశాను. థ్యాంక్యూ ఎఎంబీ టీమ్‌. మీ పని తీరు అద్భుతం.. అంటూ తన థియేటర్‌ టీంని కూడా అభినందించాడు. అంతేకాదు.. ఎఎంబీ సిబ్బందితో కలిసి ఆయన ఫొటోలు కూడా దిగాడు. గచ్చిబౌలిలో ఈ మాల్‌ కొన్ని నెలల కిందటే ప్రారంభం అయిన సంగతి తెలిసిందే.



By May 07, 2019 at 05:56AM


Read More http://www.cinejosh.com/news-in-telugu/4/45830/mahesh-babu.html

No comments